Thursday, April 15, 2010

పసినవ్వులు

నా కిప్పుడు అస్సలు ఆఫీసు కి రాబుద్ధి కావట్లేదు. నా చిట్టితల్లి తో ఎన్ని కబుర్లు అయిన చెప్పాలి అంపిస్తుంది. ఈ ప్రపంచం లో నెను ఎంత సిల్లీ కబుర్లు చెప్పినా కల్లు పెద్దవి చేసుకుని వినేది నా బంగారు తల్లి ఒక్కటేనేమో! ఆ పసి నవ్వు ప్రపంచాన్నే మరిపిస్తుంది. ఎందుకో సడన్ గా మా ఆయన మాటలు గుర్తొస్తున్నాయి. కన్న ఫ్రేమ అంటే ఇదేనా, ఇంత ఆనంద పడతాను అని ఎప్పుడు అనుకోలేదు. నిజమే! నాకు ఈ మధ్యే అర్థం అవుతుంది. ఎంతగా మారిపొయారు!! ఇంతకుముందు వీకెండ్ వస్తే ఏ టూరు కి పోదాం అని ఆలొచించే ఈయన ఎప్పుడెప్పుడు ఆఫీసు నుంచి ఇంటికి పొదామా అని ఆలొచిస్తున్నారు...టూర్ కి వెళ్ళమన్నా ససేమిరా అంటున్నారు.
ఇక నా బుడ్డి కి వీకెండ్ వస్తె పండగే. అస్సలు వదిలిపెట్టద్దు. చంక దిగనంటుంది. నిజం చెప్పొద్దు, నాకే దించాలని అనిపించదు. వంట చేస్తున్న, బట్టలు సర్దుతున్నా, తనకి చెబుతూ పనులు చేసుకుంటుంటే ఏదో తెలీని ఆనందం.
ఓ పక్క మా వారు డిసిప్లిన్ అంటూ క్లాస్ పీకుతున్నా, మరోవైపు మామ గారు ఎత్తు కి అలవాటు పడుతుందన్నా, నాకు మాత్రం ఇవేమి పట్టవు. 30 ఏళ్ళు వచ్చినా రాత్రి 2 గంటలకి పడుకొని బారెడు పొద్దు ఎక్కినా లేవని దానికి ఏమి పేరు పెట్టాలి చెప్మా అనిపిస్తుంది. పసి పిల్లకి డిసిప్లిన్ మాత్రం కావాలి అంటూ లోపల గొణుక్కోవడం నా బంగారు తల్లి కి ముద్దులు ఇవ్వడం షరా మామూలే. అస్సలు ఆ పసి నవ్వులోనే ఉంది మహత్యం అంతా. తన పర బేధభావం లేకుండా చిరునవ్వులొలికిస్తారు. అందరికి అర్థం అవుతుంది ఆ భాష. ఒక్క నవ్వు చిందించడానికి జోక్స్ అవసరం లేదు, కారనం అస్సలే అక్కర్లేదు. అందుకే కాబోలు పిల్లల్ని చూసి పెద్దలు నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి.